సెంట్రల్ బ్యాంకులొ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

సెంట్రల్ బ్యాంకులొో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

సెంట్రల్ బ్యాంకులొ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : బ్యాంకు ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గుడ్ న్యూస్.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మెనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 11, 2023 వరకు కొనసాగుతుంది. అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక సైట్‌లో centralbankofindia.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

*ఖాళీ వివరాలు :
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 50 చీఫ్ మేనేజర్ పోస్టులు, 200 సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

*విద్యా అర్హత, వయో పరిమితి :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవచ్చు. చీఫ్ మేనేజర్ వయస్సు 40 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. సీనియర్ మేనేజర్ వయస్సు 35 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అయితే, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఇవ్వబడుతుంది.

*చెల్లించాల్సిన రుసుము :
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము 850+జీఎస్టీ చెల్లించాలి. రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక సైట్‌ను సందర్శించవచ్చు.

*ఎంపిక ప్రక్రియ :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ఈ ఆన్‌లైన్ రాత పరీక్ష తాత్కాలికంగా మార్చి 2023లో నిర్వహిస్తారు.అయితే ఖచ్చితమైన తేదీ కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవడం మంచిది.