ఈ నెల 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఫిబ్రవరి 5న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. 2023-24 బడ్జెట్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ నాందెడ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి రేపు మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సంఘం (బీఏసీ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.