నిషేధిత గుట్కాను విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

నిషేధిత గుట్కాను విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: వరంగల్ నగరంలో 1,18,500 రూపాయలు విలువచేసే ప్రభుత్వ నిషేధిత గుట్కా అంబర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కాను అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ పుష్ప తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మీడియా ముందు హాజరుపరిచారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను డీసీపీ పుష్ప తెలిపారు.

నమ్మదగిన సమాచారం మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీమాబాద్ లో ఓ కిరణం షాప్ లో అక్రమంగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నారని సమాచారం వచ్చినట్లు తెలిపారు. ఈ సమాచారం మేరకు నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ పుష్ప వెల్లడించారు. ఈ సమావేశంలో ఏసీపీ గిరి కుమార్ కలకోట , సీఐ లు రమేష్ ,శ్రీనివాస్ లు పాల్గొన్నారు.