మేడారం జాతరకు హెలికాప్టర్‌ సేవలు షురూ

మేడారం జాతరకు హెలికాప్టర్‌ సేవలు షురూవరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : మేడారం జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం బేగంపేట ఎయిర్‌పోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించారు. జాయ్‌ రైడ్‌, షటిల్‌ సర్వీస్‌, చార్టర్‌ సర్వీస్‌ అనే మూడు రకాల సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సేవలు నేటి నుంచి ఆదివారం వరకు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు. హెలికాప్టర్‌ చార్టర్‌ సర్వీస్‌ అయితే కరీంనగర్‌ నుంచి మేడారానికి రూ. 75,000గా నిర్ణయించారు. హైదరాబాద్‌ నుంచి మేడారానికి రూ. 75,000, మహబూబ్‌నగర్‌ నుంచి మేడారానికి రూ. 1,00,000 టికెట్‌ ధరను నిర్ణయించారు. ఇందులో 5 సీట్లు ఉంటాయి. వీఐపీ దర్శనం కల్పిస్తారు.

మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ ప్రధాన నగరాల నుంచి హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. హనుమకొండ నుంచి హెలికాప్టర్‌ సౌకర్యం కల్పించారు. కాజీపేటలోని సెయింట్‌ గాబ్రియల్‌ స్కూల్‌ గ్రౌండ్‌ నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్‌ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది.

చార్జీలు : హన్మకొండ నుంచి మేడారం షటిల్‌ సర్వీస్‌ ఒక్కో ప్రయాణికుడికి (అప్‌ అండ్‌ డౌన్‌) రూ.19,999 మరియు జాతరలో 7,8 నిమిషాల ఏరియల్‌ వ్యూ రైడ్‌ ఒక్కొక్కరికి రూ.3,700

బుకింగ్‌ : హెలికాప్టర్‌ టికెట్‌ బుకింగ్, ఇతర వివరాల కోసం94003 99999, 98805 05905 సెల్‌నంబర్లలో లేదా [email protected] ద్వారా చేసుకోవచ్చు.