కన్నవారిని చిత్రహింసలకు గురిచేస్తే తాట తీస్తాం

కన్నవారిని చిత్రహింసలకు గురిచేస్తే తాట తీస్తాంవరంగల్ టైమ్స్, గుంటూరు జిల్లా: కన్నతల్లి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించి, కొట్టడం దారుణమని మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు చేతిలో చిత్రహింసలకు గురైన బాధితురాలు నాగమణిని వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. వృద్దులు ఎవరూ కూడా కుటుంబానికి భారం కాకూడదనే ప్రభుత్వం నెలకు రూ. 2500 పెన్షన్ అందిస్తుందని తెలిపారు. ఇటువంటి దుర్మార్గాలు, దురాఘాతాలు సమాజానికి సిగ్గుచేటన్నారు. కన్న తల్లులపై ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే తాట తీస్తామని ఆమె హెచ్చరించారు. నిందుతుడు శేషుపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితుడిపై సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కేసు నమోద చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులందరికీ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు.