ఏపీ గవర్నర్ కు కె. రామకృష్ణ లేఖ

ఏపీ గవర్నర్ కు కె. రామకృష్ణ లేఖవరంగల్ టైమ్స్, అమరావతి: ఆంధ్రావర్సిటీలో అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలున్న ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొ.పీవీజీడీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఏపీ గవర్నర్ కు లేఖ రాశారు. ఎక్కడా లేని విధంగా ఏయూలో రీవాల్యుయేషన్ పద్ధతి తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. విశ్వవిద్యాలయం ప్రతిష్టను దెబ్బతీస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాజకీయాలకు దూరంగా ఉండవలసిన వైస్ ఛాన్సలర్ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం దురదృస్టకరమని అన్నారు. వర్సిటీలో పలు కోర్సులను తొలగించడంతో పాటు తనకు అనుకూలంగా లేని సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.