తొలిసారి ఏపీ గవర్నర్‌ ప్రసంగం..ఏమన్నారంటే?

తొలిసారి ఏపీ గవర్నర్‌ ప్రసంగం..ఏమన్నారంటే?

తొలిసారి ఏపీ గవర్నర్‌ ప్రసంగం..ఏమన్నారంటే?

వరంగల్ టైమ్స్, అమరావతి : ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌. ఏపీలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలిసారిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్‌ వ్యవస్థ అమలు చేస్తున్నామని తెలిపారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు
*అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు.
*కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు.
*వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నాం.
*11.43 శాతం గ్రోత్‌ రేటును సాధించాం.
*ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉంది.
*మనబడి నాడు-నేడు పథకాలతో విద్యారంగంలో సంస్కరణలు.