బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్ 

బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్

బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్ 

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ( భారత రాష్ట్ర సమితి ) కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. యాగం, పూజలు జరుగుతున్న ప్రదేశాలను సందర్శించారు. అనంతరం సర్దార్ పటేల్ మార్గ్ నుంచి వసంత్ విహార్ కు వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ భవనాన్ని కేసీఆర్ పరిశీలించారు. అన్ని ఫ్లోర్లను కలియ తిరిగి పలు సూచనలు చేశారు. సీఎం వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.