టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష..ఎందుకంటే ?
వరంగల్ టైమ్స్, తిరుమల : కోర్టు ధిక్కరణ కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి నెల రోజుల జైలు శిక్షతో పాటు , రూ. 2వేల జరిమానా విధిస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. టీటీడీకి చెందిన ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్దీకరణ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. హైకోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో, ముగ్గురు ఉద్యోగులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసారు. ఉద్యోగులు పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష, జరిమానా విధించింది. ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు ఈవో ధర్మారెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.