శ్రీవారి లడ్డూ ఆన్లైన్ బుకింగ్ నిజమేనా..!

శ్రీవారి లడ్డూ ఆన్లైన్ బుకింగ్ నిజమేనా..!

 శ్రీవారి లడ్డూ ఆన్లైన్ బుకింగ్ నిజమేనా..!

వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుపతి శ్రీవారి దర్శనం అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకువచ్చేది శ్రీవారి ప్రసాదం లడ్డూ. ఎందుకంటే శ్రీవారి ప్రసాదం లడ్డూకు అంత క్రేజీ ఉంటుంది. అయితే తిరుపతి లడ్డూకు ఉన్న క్రేజ్ ను కొందరు క్యాష్ చేసుకుందామని ప్రయత్నిస్తూ భక్తులను మోసం చేస్తున్నట్లు పోలీసులు, టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తిరుపతి లడ్డూను ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చనని ప్రచారం మొదలు పెట్టారు. ఇది నిజమే అనుకుని భక్తులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తుండగా గుర్తించిన టీటీడీ అధికారులు స్పందించారు. ఆన్లైన్ లో తిరుపతి లడ్డూలు బుక్ చేసుకోవచ్చననే ప్రచారంలో నిజం లేదన్నారు.

టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అంతేకాని దర‌్శనంతో సంబంధం లేకుండా ఎవరు పడితే వారు తిరుపతి లడ్డూలను టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చని వస్తున్న వదంతులను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.