స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి 

స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఢిల్లీలో తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న ఓ బాలికపై ఓ బాలుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన సఫ్దర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.

స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి 

ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేడు ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని ద్వారక జిల్లా ఏరియాలో యాసిడ్ దాడి ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఐతే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యాసిడ్ దాడికి పాల్పడిన బాలుడు ఎవరు? బాలికతో పాటు తను కూడా అదే పాఠశాలలో చదువుతున్నాడా ? లేదా ఆ బాలుడు బయటి వ్యక్తా ?, అతను బాలికపై ఎందుకు యాసిడ్ దాడి చేయాల్సి వచ్చింది ? అనే కోణాల్లో తాము కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే పదేండ్ల క్రితం నిర్భయ ఘటనతో ఇటీవల శ్రద్ధా వాకర్ ఘటనతో కలకలం రేగిన ఢిల్లీలో తాజాగా ఈ దారుణం చోటుచేసుకుంది.