తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గం.ల సమయం
వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో నాలుగు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వీరికి సర్వదర్శనం 8 గంటల్లో అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 65,466 మంది భక్తులు దర్శించుకోగా 26,174 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.29 కోట్లు వచ్చిందని తెలిపారు.