హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. శుక్రవారం కొత్తగా 2295 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో తాజాగా ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీలోనే అత్యధికంగా 1452 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసులు భారీగా పెరిగినప్పటికీ రాష్ట్రంలో రికవరీ రేటు 97.98 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 64,474 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Home Health
Latest Updates
