సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్ ప్రతినిధులు పర్యటనలు ముమ్మరం చేస్తున్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై, అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాజాగా మరో పక్షం రోజులకు సంబంధించిన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 13 నుంచి 28 వరకు 54 సభల్లో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు 30 నియోజకవర్గాల్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం హాజరయ్యారు. నవంబర్ 9 నుంచి 12 వరకు పలు నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరవనున్నారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లను దాఖలు చేయనున్నారు.ఈ నెల 25న హైదరాబాద్ లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభ పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ 28న సభతో ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.
నవంబర్ 13న -నర్సంపేట, బూర్గంపాడు( భద్రాచలం),దమ్మపేట
నవంబర్ 14న- పాలకుర్తి, హలియా( నాగార్జున సాగర్),ఇబ్రహీంపట్నం
నవంబర్ 15న- బోధన్,నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్
నవంబర్ 16న- ఆదిలాబాద్,బోత్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్
నవంబర్ 17న- కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, పరకాల
నవంబర్ 18న- చేర్యాల బై రోడ్డు ( జనగామ)
నవంబర్ 19న- అల్లాపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి
నవంబర్ 20న- మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్గొండ
నవంబర్ 21న- మదిర,వైరా,డోర్నకల్,సూర్యాపేట
నవంబర్ 22న- తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి
నవంబర్ 23న- మహేశ్వరం, వికారాబాద్,జహీరాబాద్,పటాన్ చెరు
నవంబర్ 24న- మంచిర్యాల,రామగుండం,ములుగు,భూపాలపల్లి
నవంబర్ 25న- హైదరాబాద్ పబ్లిక్ మీటింగ్
నవంబర్ 26న- ఖానాపూర్,జగిత్యాల,వేములవాడ, దుబ్బాక
నవంబర్ 27న- షాద్ నగర్, చేవెళ్ల, ఆంథోల్, సంగారెడ్డి
నవంబర్ 28న- వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు, గజ్వేల్