దేశంలో కొత్తగా 6,561 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 6,561 కరోనా కేసులు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : భారత్ లో కొత్తగా 6,561 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,45,160కి చేరాయి. ఇందులో 4,23,53,620 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా 5,14,388 మంది మరణించారు. మరో 77,152 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 142 మంది కరోనాకు బలయ్యారు. 14,947 మంది కోలుకున్నారని తెల్పింది. కేరళలో కొత్తగా నమోదైన కేసులు అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో 2373 మందికి కరోనా సోకింది. ఇక మహారాష్ట్రలో 544 కేసులు, ఢిల్లీలో 325, తమిళనాడులో 320, ఉత్తరప్రదేశ్ లో 216, మధ్య ప్రదేశ్ లో 259, హర్యానా 232 చొప్పున కేసులు నమోదయ్యాయి.