రాజీనామా వైపు సోనియా, ప్రియాంక, రాహుల్..?

రాజీనామా వైపు సోనియా, ప్రియాంక, రాహుల్..?

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. 5 రాష్ట్రాల ఘోర పరాభవం, జీ 23 నేతల డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ వాద్ర సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు కాంగ్రెస్ లోని తమ పదవులకు రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం.రాజీనామా వైపు సోనియా, ప్రియాంక, రాహుల్..?5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. 5 రాష్ట్రాల ఘోర పరాభవం, జీ 23 నేతల డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురూ కాంగ్రెస్ లోని తమ పదవులుకురాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవానికి తమను తాము బాధ్యులుగా ప్రకటించుకుంటూ, రాజీనామాలు చేయనున్నారు.

ఆదివారం కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండలి సీడబ్ల్యూసీ భేటీ జరుగనుంది. ఈ భేటీకి సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశం వేదికగానే సోనియా, రాహుల్, ప్రియాంక రాజీనామాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా ఇలానే సోనియా, రాహుల్ రాజీనామా చేస్తామని ప్రకటించారు. అయితే సీడబ్ల్యూసీ మాత్రం తిరస్కరించింది. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.