త్వరలో వస్తున్న”విక్రమ్ రాథోడ్”

త్వరలో వస్తున్న"విక్రమ్ రాథోడ్"
హైదరాబాద్ : విజయ్ ఆంటోనీ… తమిళ సినిమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. స్టార్ హీరోలకు మాదిరిగా పేరుకు ముందు పేరు తర్వాత పెద్ద టైటిల్స్ ఏమీ లేనప్పటికీ.. ఆడియెన్స్‌ని ఆలోచింపచేసే విధంగా కథలు ఎంచుకుని సినిమాలు చేయడంలో ముందుండే హీరో అనే పేరు మాత్రం ఉంది. టాలీవుడ్‌లోనూ విజయ్ ఆంటోనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. బిచ్చగాడు చిత్రం నుంచే విజయ్ ఆంటోనీ చిత్రాలకు మంచి ఆధరణ ఉంది.
తాజాగా మరొక డీఫ్రెంట్ కథాంశంతో “విక్రమ్ రాథోడ్” గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పెప్సి శివ సమర్పణలో విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా, రెమిసెస్ హీరోయిన్ గా సురేష్‌ గోపి, సోనూసూద్‌, యోగిబాబు నటీ, నటులుగా తమిళ దర్శకుడు బాబు యోగేశ్వరన్‌ డైరెక్ట్ చేస్తున్న తమిళరసన్ సినిమాను తెలుగులో “విక్రమ్ రాథోడ్” అనే టైటిల్‌తో డబ్ అవుతోంది ఈ సినిమాను ఎస్‌.కౌశల్య రాణి నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో రావూరి వెంకటస్వామి విడుదల చేస్తున్నారు. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు
విజయ్‌ ఆంటోని , రెమిసెస్, సురేష్‌ గోపి, సోనూసూద్‌, యోగిబాబు తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ : పెప్సి శివ
నిర్మాత : ఎస్‌.కౌశల్య రాణి
దర్శకుడు బాబు యోగేశ్వరన్‌
సంగీతం: ఇళయరాజా,
ఛాయాగ్రహణం: ఆర్‌.డి.రాజశేఖర్‌.
పి.ఆర్ ఓ : మధు వి.ఆర్