యాదాద్రిని దర్శించుకున్న గద్దర్

యాదాద్రిని దర్శించుకున్న గద్దర్యాదాద్రి : ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ అర్చకులు గద్దర్ కి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం నూతన ఆలయాన్ని ఆయన పరిశీలించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం చారిత్రక ధ్యాన మందిరమని గద్దర్ అభివర్ణించారు.

యాదాద్రి ఆలయాన్ని చైతన్య మందిరంగా ప్రజలు స్వీకరించాలని సూచించారు. యాదాద్రి శిల్పకళను చూస్తే ప్రకృతి దేవతలను ప్రతిష్టించినట్లుగా ఉన్నదని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందు, ప్రత్యేక రాష్ట్రం అయ్యాక ఉన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ‘నర్సన్న..ఓ నర్సన్న యాదాద్రి వయ్యావు’ అంటూ గద్దర్ పాడిన పాట విశేషంగా ఆకట్టుకున్నది.