వీజే సన్నీనే విజేత…అంబరాన్నంటిన సంబురాలు

వీజే సన్నీనే విజేత…అంబరాన్నంటిన సంబురాలు

వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. సెప్టెంబర్ 5న మొదలైన ఈ షో 19 మంది కంటెస్టులతో 105 రోజుల పాటు విజయవంతంగా జరిగింది. చివరి రోజు చివరి ఎపిసోడ్ అత్యంత ఆహ్లాదకరంగా ప్లాన్ చేశారు నిర్వహకులు. 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ షోలో ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంటే విన్నర్ ఎవరు అవుతారో అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ టీవీలకు అతుక్కుపోయారు. అయితే వీజే సన్నీనే ట్రోఫీ గెలుచుకుంటాడన్న నమ్మకంతో ఆయన అభిమానులు ముందునుంచే అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, గ్రాండ్ వెల్ కమ్ కు రెడీగా అయ్యారు.వీజే సన్నీనే విజేత...అంబరాన్నంటిన సంబురాలుబిగ్ బాస్ సీజన్ 5 టాప్ 5లో సిరి, మానస్, శ్రీరామచంద్ర, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్ లు నిలిచినప్పటికీ ఆ ముగ్గురు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు. చివరగా వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్ లు నిలవగా, చివరి రోజు గెలుపు ఉత్కంఠతకు దారి తీసింది. మొత్తానికి అభిమానులు ఎదురుచూసినట్లుగానే బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ గా షణ్మక్ జశ్వంత్ ను, బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీని బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించడంతో ఇక అభిమానుల్లో అంతులేని ఆనందం పుట్టుకొచ్చింది.

అన్నపూర్ణ స్టూడియో ముందు వీజే సన్నీ కోసం ఎదురుచూసిన అభిమానుల సంబురాలు అంబురాన్నంటాయి. ఇక వీజే సన్నీ తల్లిదండ్రుల ఆనందం ఆకాశాన్నంటిందని చెప్పచ్చు.. ముందుగానే వీజే సన్నీ విన్నర్ అని గెస్ చేసిన ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు.  హైదరాబాద్ నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. టపాసులు పేల్చుతూ..సంబరాలు జరుపుకున్నారు. సన్ని విన్నింగ్ సెలబ్రేషన్స్ కి తన ఇళ్లు కన్వీనెంట్ గా లేకపోవడంతో తన స్నేహితులు, అభిమానులు మాదాపూర్ లోని ఓ ప్రైవేట్ కన్వెషన్ హాల్ లో డీజే నైట్ ఏర్పాటు చేశారు.

ఇక బంజారాహిల్స్ రోడ్డు 2లోని అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చిన బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీని చూసిన అభిమానులు ఒక్కసారిగా కేరింతలు పెట్టారు. బాణ సంచా పేల్చారు. అభిమానులకు థ్యాంక్స్ చెప్నిన సన్నీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మాదాపూర్ లోని ప్రైవేట్ కన్వెషన్ హాల్ కు ర్యాలీగా బయల్దేరారు. వీజే సన్నీ రోడ్ షో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి భారీ బందోబస్తు మధ్య  మాదాపూర్ వైపుకు బయలుదేరింది. కుటుంబసభ్యులు,స్నేహితులు, అభిమానులు బాణసంచా పేల్చుతూ, కేరింతలు కొడుతూ నిర్వహించిన ఈ రోడ్ షో కోలాహలంగా మారింది. వీజే సన్నీ ప్రతీ ఒక్కరిని అభివాదం చేస్తూ తన విన్నింగ్ ను కోరిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.