2022 అండర్-19 వరల్డ్ కప్ జట్టు ఖరారు

2022 అండర్-19 వరల్డ్ కప్ జట్టు ఖరారుహైదరాబాద్ : 2022లో జరిగే అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్ కు బీసీసీఐ ఆదివారం 17 మంది సభ్యుల టీంను ప్రకటించింది. 2022, జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్ లో ఈ టోర్నీ జరుగనున్నది. ఢిల్లీ బ్యాట్స్ మన్ యశ్ దుల్ సారథిగా, ఎస్కే రషీద్ ను వైస్ కెప్టెన్ గా బీసీసీఐ నియమించింది.

14వ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో 16 జట్లు 48 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఇప్పటి వరకు 4 దఫాలు ఐసీసీఐ అండర్-19 వరల్డ్ కప్ ను టీం ఇండియా గెలుచుకున్నది. 2000, 2008, 2012, 2018 సంవత్సరాల్లో టీం ఇండియా టైటిల్ కైవసం చేసుకున్నది. 2016లోనూ రన్నరప్ గా నిలిచింది. ఇంతకు ముందు 2020లో న్యూజిలాండ్ లో ఈ టోర్నీ జరిగింది. టీం ఇండియా గ్రూప్-బీ లో ఆడనున్నది.