భారత్ గౌరవ్ కు దాస్యం గ్రాండ్ వెల్ కమ్

భారత్ గౌరవ్ కు దాస్యం గ్రాండ్ వెల్ కమ్

భారత్ గౌరవ్ కు దాస్యం గ్రాండ్ వెల్ కమ్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : “గంగా పుష్కరాల యాత్ర: పూరీ-కాశీ-అయోధ్య” భారత్ గౌరవ్ పర్యాటక రైలును రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పచ్చ జెండా ఊపి స్వాగతించారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్ లోకి ఎంట్రీ ఐన “గంగా పుష్కరాల యాత్ర: పూరీ-కాశీ-అయోధ్య” రైలుకు దాస్యం వినయ్ భాస్కర్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ రైలులో ఉన్న బోర్డింగ్ యాత్రికులకు స్నాక్స్ , వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉన్న ఈ రైలు లో ప్రయాణించడం భక్తులకు సౌకర్యంగా ఉంటుందని, ఇలాంటి రైళ్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ కోరారు.ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు మేయర్ గుండు సుధారాణి, టైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, రైల్వే అధికారులు, స్థానిక కార్పొరేటర్ సంకు నర్సింగ్, బీఆర్ఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.