బావని హత్య చేసిన సొంత మరదలు!

బావని హత్య చేసిన సొంత మరదలు!

వరంగల్ టైమ్స్, హనుమకొండ: హసన్ పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో దారుణం జరిగింది. సిద్దాపురం గ్రామానికి చెందిన బాల్నే మొగిలి దారుణ హత్యకు గురయ్యాడు. సొంత మరదలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు మొగిలిని అతిదారుణంగా గొడ్డలితో, కత్తులతో హత్య చేసినట్లు గుర్తించారు. హత్యకు గల కారణాలు పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.