ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు

ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు

జనాన్ని ఆకట్టుకునేందుకు అధికారుల యోచన 
15 ఏళ్లుగా ఒకే రంగుతో ‘పాతబడ్డ’ లుక్‌

వరంగల్ టైమ్స్, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సుల రంగులు మారబోతున్నాయి.ప్రయోగాత్మకంగా తొలుత సిటీ బస్సుల రంగు మార్చాలని ఆర్టీసీ భావిస్తోంది. తీవ్ర నష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు కొత్త ఎండీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, బస్సులు చూడగానే ఆకట్టుకునేలా కనిపించాలని సంస్థ భావిస్తోంది.ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులుచాలాకాలంగా ఒకే రంగుతో ‘పాతబడ్డ’ బస్సులకు కొత్త రంగులతో కొత్త లుక్‌ తేవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో ఆర్టీసీ తీవ్ర నష్టాలు మూటగట్టుకుంటోంది. కోవిడ్‌తో కునారిల్లి నెలరోజులుగా సిటీ బస్సులు మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నా.. మరింత పెరగాల్సిందేనన్న ఉద్దేశంతో ఆర్టీసీ ఉంది. ఇందుకు వాటి రంగులు మార్చడం ద్వారా కొంత ఫలితాన్ని పొందొచ్చని ఆశిస్తున్నారు.