సోనూసూద్ సోదరి పోటీ ఎక్కడి నుంచో తెలుసా ?

సోనూసూద్ సోదరి పోటీ ఎక్కడి నుంచో తెలుసా ?చండీగఢ్ : పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం జోరందుకుంది. అన్ని పార్టీలు పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలు బరిలో నిలువబోయే అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ 86 మంది అభ్యర్థుల పేర్లతో లిస్టును వెల్లడించింది. చామ్ కౌర్ సాహిబ్ నుంచి పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పోటీ చేయనున్నారు. అదే విధంగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నాయి. సీనియర్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా కాడియన్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు.

ఇక ప్రముఖ పంజాబీ సింగర్ సిధూ మూసేవాలా మాన్సా స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించేకోనున్నారు. ఇక నటుడు సోనూసూద్ సోదరి మాల్విక సూద్ మోగా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాగా మొత్తం 117 నియోజకవర్గాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగనుంది. అదే రోజు యూపీలో రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి. పంజాబ్ తో పాటు యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.