విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం

విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే వన్డే, టీ 20 కెప్టెన్సీలను వదులుకున్న కోహ్లీ తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెబుతూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత విరాట్ కోహ్లీ 2014లో టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీంఇండియా తొలి స్థానంలో నిలిపాడు. 68 టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ, 40 విజయాలను అందించాడు. అత్యధిక మ్యాచ్ లు గెలిపించిన కెప్టెన్ గా నిలిచాడు.టెస్ట్ కెప్టెన్సీని వదులుకుంటున్నట్టుగా ట్విట్టర్ వేదికగా ప్రకటించిన కోహ్లీ సుదీర్ఘ లేఖను రాసుకొచ్చాడు. టీంను సరైన దిశలో నడిపించేందుకు గత ఏడేండ్లుగా తనవంతు కృషిచేశానని ట్వీట్ లో పేర్కొన్నాడు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిజాయితీతో నిర్వహించానని వెల్లడించారు. టీంఇండియా కెప్టెన్ గా ఎన్నో సవాళ్లను అధిగమించానని తెలిపాడు.

తన జర్నీలో ఎన్నో విజయాలు , ఎన్నో పరాజయాలను చూశానని తెలిపాడు. కానీ ఎప్పుడూ తన ప్రయత్నాన్ని మాత్రం వదల్లేదని చెప్పాడు. పూర్తి నమ్మకంతో నూటికి 120 శాతం శ్రమించానని పేర్కొన్నాడు. టీంకు ఏది అవసరమో అదే చేశాను. ఏది సరైందో కాదో అది ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. నా జట్టు గౌరవించే పని ఏదో నాకు పూర్తి క్లారిటీ ఉందని తెలిపాడు.

ఇన్నేళ్లు నా దేశాన్ని నడిపించే బాధ్యత అందించిన బీసీసీఐకి కృతజ్ఞతలు. ఇన్నేళ్ల పాటు తనకు తోడుగా నిలిచిన జట్టు సభ్యులకు థాంక్స్ . మీరంతా కలిసి నా జర్నీని మధురజ్ఞాపకంగా నిలిపారు. ఒక బండికి ఇంజిన్లా నా వెన్నంటి ఉండి నడిపించిన రవిశాస్త్రికి ఎప్పటికీ రుణపడి ఉంటా.. ఇక చివరగా నన్ను నమ్మి, కెప్టెన్ గా రిఫర్ చేసిన ఎమ్మెస్ ధోనీకి బిగ్ థాంక్స్ అంటూ ట్విట్టర్ లో కోహ్లీ రాసుకొచ్చాడు.