భారత ఆర్మీకి కొత్త యూనిఫాం

భారత ఆర్మీకి కొత్త యూనిఫాంన్యూఢిల్లీ : ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా సరికొత్త యూనిఫామ్ తో భారతీయ అత్యున్నత కమెండో దళం ముందుకు వచ్చింది. జనవరి 15న ఆర్మీ డే పరేడ్ సందర్భంగా కొత్త యూనిఫాంను అధికారికంగా ప్రదర్శించారు. నేడు కమెండో దళం కొత్త యూనిఫాం ధరించి కవాతులో అధికారికంగా ప్రదర్శించింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (ఎన్ఐఎఫ్ టీ) చే తయారు చేయబడ్డ డిజిటల్ యూనిఫాంను అత్యాధునికి టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసినట్లు సమాచారం.

ఆర్మీ సిబ్బందికి మరింత సౌలభ్యం ఇవ్వడంతో పాటు మన్నికగా ఉండే యూనిఫాంను తీసుకురానున్నట్లు నెల రోజుల క్రితమే పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారికంగా యూనిఫామ్ మార్పుకు సంకేతాలు తీసుకువచ్చినట్లు సమాచారం అందిన విషయం విదితమే. కొత్త యూనిఫాం రంగు ప్రకృతిలో సులభంగా కలిసిపోయే విధంగా, ఎలాంటి కాలంలోనైనా సిబ్బందికి అనుకూలంగా ఉండేలా డిజైన్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ముఖ్యంగా శత్రువులు గుర్తించలేని విధంగా ఈ యూనిఫాం ఉంటుందని పేర్కొన్నాయి. వివిధ రంగుల సమ్మేళనంతో ఈ యూనిఫాం ఉండనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పుడున్న యూనిఫాంతో పోలిస్తే కొత్త డిజిటల్ యూనిఫాం బరువు తక్కువగా ఉంటుంది.