కొత్తగా 1,963 కరోనా కేసులు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోల్చితే నేడు కరోనా కేసులు కాస్త తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,963 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. మరో 1,620 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,017 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తెలంగాణలో నేడు 53,073 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.