టాప్ 10లో మొదటి భారత వికెట్ కీపర్ గా పంత్

టాప్ 10లో మొదటి భారత వికెట్ కీపర్ గా పంత్

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్  : టీంఇండియా స్టార్ ఆల్ రౌండర్, సర్ రవీంద్ర జడేజా టెస్టు ర్యాంకింగ్స్ లో దుమ్ములేపాడు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో తగ్గేదేలే అంటూ ఆలౌరౌండర్ ల జాబితాలో అగ్రస్థానంకు దూసుకొచ్చాడు. శ్రీలంకతో జరిగిన మోహాలీ టెస్టులో భారీ సెంచరీ ( 175 నాటౌట్ ), 9 వికెట్లు పడగొట్టడంతో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 406 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్ ఒక స్థానం దిగజారి, 382 పాయింట్లతో రెండో స్థానానికి చేరాడు. ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానం కోల్పోయి 347 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 10వ స్థానానికి దూసుకొచ్చాడు. పంత్ ఖాతాలో ప్రస్తుతం 723 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.టాప్ 10లో మొదటి భారత వికెట్ కీపర్ గా పంత్ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్ 10లో చేరిన మొదటి భారత వికెట్ కీపర్ గా పంత్ తన పేరుపై ఓ రికార్డు నెలకొల్పాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. టీమిండియా టెస్టు జట్టులోకి వచ్చిన అనతి కాలంలోనే పంత్ టాప్ 10లోకి రావడం విశేషం. ఇప్పటివరకు 29 టెస్టు మ్యాచ్ లు ఆడిన పంత్ , 40 సగటుతో 1831 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. 763 రేటింగ్ పాయింట్లతో మాజీ సారథి విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా, 761 రేటింగ్ పాయింట్లతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో నిలిచాడు. 723 రేటింగ్ పాయింట్లతో రిషబ్ పంత్ 10వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.