శ్రీవారి సేవలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

శ్రీవారి సేవలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. శ్రీనివాసుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో – ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. శ్రీవారి సేవలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. భవిష్యత్ తరాలకు బంగారు తెలంగాణ అందించేలా కేసీఆర్ కి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వెల్లడించారు.