ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు: ఆళ్ల నాని

ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు..దోషులనుగుర్తించి కఠినంగా శిక్షించాలి మంత్రి ఆళ్ల నాని

ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు: ఆళ్ల నానిఏలూరు : ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని మంత్రి ఆళ్లనాని అన్నారు. మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఏలూరు నుంచి హుటాహుటిన బందర్​ బయలు దేరారు. ఆదివారం మధ్యాహ్నం బందర్ మార్కెట్ యార్డ్ లో మంత్రిని పరామర్శించి దాడికి గల కారణాలు తెలుసుకున్నారు. పేర్ని నాని వివాద రహితుడని అందరితో కలుపుకోలుగా ఉంటారన్నారు. తల్లిగారు చనిపోయిన బాధలో ఉన్న మంత్రి పై హత్యా యత్నం కు పాల్పడం దారుణమన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు. నానితో పాటు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డిజిపి గౌతమ్ సవాంగ్ ఉన్నారు. మరోపక్క ఈ ఘటనపై మీడియాతో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రి పేర్ని నాని పై జరిగిన దాడి వివరాలు సేకరిస్తున్నామని నిందితుడు బడుగు నాగేశ్వరరావు గొడుగుపేట కు చెందిన వాస్తవ్యుడు గా విచారణలో తేలిందని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ చేస్తున్నామని అన్నారు. ఉద్దేశపూర్వకంగా చేశారా… లేదా మరోక కోణం ఏదైనా ఉందా అనే విషయాలు సేకరిస్తున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.