లైవ్​లో ఆసక్తికర సంఘటన జరింగింది

లైవ్​లో ఆసక్తికర సంఘటన జరింగిందిసిడ్నీ: భారత్​ ,ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్​కు ఆతిథ్యం వహిస్తున్న సిడ్నీ మైదానం ఓ జంటను ఏకం చేసిన వేదికగా మారింది. మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో భారత్​ బ్యాట్స్​మెన్​ కోహ్లీ , శ్రేయస్​ అయ్యర్​ బ్యాటింగ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక భారత యువకుడు ఆస్ట్రేలియా యువతికి తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమె ఎదుట మోకాళ్లపై ఉండి ఉంగరం చూపిస్తూ తనను పెళ్లి చేసుకుంటావా ..అని అడిగాడు. ఈపరిణామానికి ఆశ్చర్యపోయిన యువతి యువకుడి ప్రేమకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చి పచ్చజెండా ఊపింది. అయితే ఇదంతా కెమెరాకు చిక్కి స్టేడియంలో ఉన్న పెద్ద స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారమైంది. ఇది గమనించిన ప్రేక్షకులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఇదిలా ఉండగా మైదానంలో ఫిల్లింగ్​ చేస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్​వెల్​ సైతం ఆ యువ జంటను చూసి తను సైతం చప్పట్లు కొడుతూ అభినందించాడు. మరో ఆసక్తికర విషయం ఏంటనగా మ్యాక్స్ వెల్​ భార్య కూడా భారతీయ యువతి కావడం గమనార్హం.​ ప్రస్తుతం ఆ జంటకు సంబంధించిన వార్త సోషల్​ మీడియాలో వైరల్​అవుతుంది. ఎక్కడ చూసినా ఈవార్త హాట్​టాఫిక్​ గా మారింది.