భవనం కూలి ఇద్దరు మృతి

భవనం కూలి ఇద్దరు మృతిఅనకాపల్లి : పాతభవనం కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన అనకాపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక షిర్డీ సాయి, పర్తిసాయి సినిమా థియేటర్ వద్ద ఉన్న చైతన్య జూనియర్ కళాశాల పక్కన గల పాత భవనంలో గౌరి స్టీల్స్ అండ్​ ట్రేడర్స్ యజమాని మాదేటి నూకరాజు (65) అందులో పనిచేస్తున్న బోయిన రమణ (67) షాపులో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భవనం కూలిపోవడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.