రెండో వన్డేలో భారత్ ఓటమి సిరీస్​ ఆసీస్​దే..

రెండో వన్డేలో భారత్ ఓటమి సిరీస్​ ఆసీస్​దే..సిడ్నీ: ఆస్ట్రేలియా లో విరాట్​ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్​ జట్టు వరుస ఓటములతో ఆరంభించింది. ఆల్​రౌండ్ షోతో ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిధ్య సిరీస్​ వరుసగా రెండు వన్డేల్లో నెగ్గి మూడు మ్యాచ్​ల సిరీస్​ను 2‌‌.0తో కైవసం చేసుకుంది. ఆదివారం సిడ్నీ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్​పై 51 పరుగుల తేడాతో ఆసీస్​ ఘన విజయం సాధించింది. కెప్టెన్​ విరాట్​ కోహ్లీ (89/87 బంతులలో 7ఫోర్లు ,2 సిక్సర్లు), కేఎల్​ రాహూల్​ (76/ 66 బంతులలో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో భారత్​ 9 వికెట్లకు 338 పరుగులు చేసింది. ఆసీస్​ బౌలర్లు కమిన్స్​ 3 /67, హేజిపుల్​వుడ్​ 2/59, ఆడమ్​ జంపా2/62 భారత్​ను దెబ్బ కొట్టారు. తొలి వన్డేలో కోహ్లీ సేన 66 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే 390 పరుగుల భారీ లక్ష్య చేధనలోబరిలోకి దిగిన భారత్​కు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు.