పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి : కలెక్టర్ 

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి : కలెక్టర్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : పెండింగ్ ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శనివారం సుబేదారిలోని కలెక్టర్ కార్యాలయం మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి : కలెక్టర్ జిల్లాలో వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, వారు ధరఖాస్తు చేసుకున్న ఉపకార వేతనాలలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆధార్ అనుసంధానం, యూఐడి, వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్, బయేమెట్రిక్ తదితర సాంకేతిక సమస్యలు వచ్చిన వెంటనే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మార్చి నెలలోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా 788 ఉపకార వేతనాలు వివిధ రకాల సమస్యలతో పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.

 

వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతీ విద్యార్థికీ ఉపకారవేతనం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మరొక సారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల, శ్యామ్ కుమార్, ఇందిర దేవి, కిరణ్మయి, లక్ష్మయ్య, దివాకర్, శ్రీనివాస్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్లు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.