మొదలైన ఐపీఎల్..తొలి పోరులో CSK vs KKR 

మొదలైన ఐపీఎల్..తొలి పోరులో CSK vs KKR

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరునం వచ్చేసింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా గత రెండేండ్లుగా యూఏఈ వేదికగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) ఈ సారి సొంత ప్రేక్షకుల మధ్య జరుగనుంది. 2 నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించనున్న ఐపీఎల్ 15వ సీజన్ కు శనివారం తెరలేచింది.మొదలైన ఐపీఎల్..తొలి పోరులో CSK vs KKR ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్ చెన్నై, కోల్ కతా మధ్య జరుగనుంది. తొలి పోరులో కోల్ కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై ముందు బ్యాటింగ్ చేయనుంది. తొలి పోరు కోసం ముంబై వాంఖడే స్టేడియం సిద్ధమైంది. చెన్నై టీం నుంచి గైక్వాడే, కాన్వే, ఉతప్ప, రాయుడు, జడేజా ( కెప్టెన్ ), ధోనీ ( వికెట్ కెప్టెన్ ), దుబే, బ్రావో, మిల్నే, దేశ్ పాండే, శాంత్నర్ బరిలో ఉన్నారు. కోల్ కతా నుంచి శ్రేయాస్ అయ్యర్ ( కెప్టెన్ ), రహానే, నితీశ్ రానా, వెంకటేశ్ అయ్యర్, రషెల్, బిల్లింగ్స్, నారినే, జాక్ సన్ ( వికెట్ కీపర్ ), శివమ్ మవి, ఉమేశ్ యాదవ్, చక్రవర్తి బరిలో ఉన్నారు.