శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న గవర్నర్

శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న గవర్నర్

వరంగల్ టైమ్స్, కర్నూలు జిల్లా : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్న ఆమెకు కర్నూలు కలెక్టర్ కోటేశ్వర్ రావు భ్రమరాంబ అతిథి గృహం వద్ద ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రధాన గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో ఆలయ ప్రవేశం చేయించారు.

అనంతరం స్వామి అమ్మవార్లను గవర్నర్ దర్శించుకున్నారు. ఆ తర్వాత ప్రకార మండపంలో అర్చక వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం గవర్నర్ కు ఈవో స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, శేషవస్త్రాలను అందించారు. తెలంగాణ గవర్నర్ వెంట కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, ఆర్డీవో హరిప్రసాద్ , ఆత్మకూర్ డీఎస్పీ శృతి ఉన్నారు.