అద్భుతం..మూగబోయిన గొంతుకు మళ్ళీ మాటలు

అద్భుతం..మూగబోయిన గొంతుకు మళ్ళీ మాటలు

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : అదృష్టవంతుడిని పాడు చేసేవాడు లేడు.. అన్న సామెత ఈ వ్యక్తి విషయంలో నిజం అయింది. కరోనా వైరస్ తో ఎంతో మంది శారీరకంగా మానసికంగా ఆర్ధికంగా ఇబ్బందుకు ఎదుర్కొంటుంటే.. అందుకు వ్యతిరేకంగా ఈ వ్యక్తి గత ఐదేళ్ళ నుంచి పడుతున్న ఆరోగ్య బాధల నుంచి విముక్తి పొందాడు. మన దేశంలో కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్ డ్రైవ్ మొదలు పెట్టారు. ఇప్పటికి దేశ వ్యాప్తంగా 150 కోట్ల డోసులకు పైగా కోవిడ్ టీకాలు వేశారు.అద్భుతం..మూగబోయిన గొంతుకు మళ్ళీ మాటలుఅయినప్పటికీ ఇప్పటికీ వ్యాక్సిన్ (covid 19 Vaccine)పై చాలా మందిలో అనుమానాలున్నాయి. దీంతో చలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. కానీ ఓ వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ అద్భుతం చేసింది. గత కొన్నేళ్లుగా పక్షవాతంలో మంచానికే పరిమితమైన ఓ వ్యక్తిలో కదలికలు తెప్పించింది కరోనా వ్యాక్సిన్. అంతేకాదు మూగబోయిన ఆ గొంతు మళ్ళీ మాట్లాడం మొదలు పెట్టింది. ఇది చూసి డాక్టర్లు సైతం షాక్ తిన్నారు. ఆ అద్భుతం ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రాష్ట్రంలోని బొకారో జిల్లాలోని పెతర్వార్ మండలం సల్గాడి గ్రామంలో దులార్ చంద్ (55) అనే వ్యక్తీ నివసిస్తున్నాడు. ఇతను ఐదేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు, వెన్నె కు ఆపరేషన్ చేసి.. అతి కష్టం మీద వైద్యులు ప్రాణాలను నిలబెట్టారు. అయితే అప్పటి నుంచి దులార్ చంద్ శరీరంలో అవయవాలు పనిచేయడం మానేశాయి. మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి మంచం మీదనే అన్నీని. అయితే కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ దులార్ చంద్ కు కూడా టీకా వేయించారు కుటుంబ సభ్యులు.

జనవరి 4న అంగన్‌‌వాడీ కార్యకర్తలు దులార్ చంద్ ఇంటికి వెళ్లి మరీ కొవిషీల్ట్ టీకాను ఇచ్చారు. అయితే ఇక్కడే మ్యాజిక్ జరిగింది. వ్యాక్సిన్ అతని పాలిట సంజీవని అయ్యింది. డాక్టర్లకు కూడా అర్ధం కాని విధంగా దులార్‌చంద్‌ ముండాకు కొత్త జీవితం ప్రసాదించింది. నెక్స్ట్ డే నుంచి మాట్లాడడం ప్రారంభించాడు. అంతేకాదు శరీరంలోని అవయవాలలో కదలికలు వచ్చాయి. దీంతో దులార్‌చంద్ ఫ్యామిలీ హర్షం వ్యక్తం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ నిజంగా అద్భుతం చేసిందని దులార్‌చంద్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్ సుమిత్రా దేవి కూడా సంతోషంగా చెబుతున్నారు. అయితే దీనిపై అధ్యయనం జరగాల్సి ఉందని చెప్పారు. ఇది ఎవరికీ ఊహకు అందని అద్భుతమని సివిల్ సర్జన్ డాక్టర్ జితేంద్ర కుమార్ చెప్పారు.