సెమీస్ లో భారత్ షట్లర్ పీవీ సింధు ఓటమి

సెమీస్ లో భారత్ షట్లర్ పీవీ సింధు ఓటమిస్పోర్ట్స్ డెస్క్ : వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన భారత్ బ్యాట్మింటన్ ప్లేయర్ పీవీ సింధు శనివారం ఇండియన్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీ సెమీస్ లో ఓటమి పాలైంది. గత సంవత్సరం ఇండోనేషియా మాస్టర్స్ లో పోటీ పడి ఓడించిన థాయిలాండ్ ప్లేయర్ కటేథాగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 14-21, 21-13, 10-21 పాయింట్ల తేడాతో పీవీ సింధు ఓటమి పాలైంది. ఇదే టోర్నీలో భారత షట్లర్ లక్ష్యసేన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

నువ్వా నేనా అన్నట్లుగా సాగిన సెమీస్ లో మలేషియా 60వ ర్యాంకర్ యోంగ్ ను 19-21, 21-16, 21-12 తేడాతో ఓడించి ఫైనల్స్ కు క్వాలిఫై అయ్యాడు. ఫైనల్స్ లో సింగపూర్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ లోకియా యూతో సమరానికి సిద్ధమయ్యాడు.

ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్యసేన్, క్వార్టర్ ఫైనల్లో సహచర భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ పై 14-21, 21-09, 21-14 తేడాతో గెలిచి సెమీస్ కు చేరాడు. కాగా ఈ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భారత షట్లర్లు కరోనా బారిన పడ్డారు.