మానుకోటలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు

మహబూబాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి 6 ఏళ్లు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగుపెడుతున్న పర్వదినాన మహబూబాబాద్ అమర వీరుల స్తూపం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ పుష్పగుఛ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. మంత్రితో పాటు ఎంపి మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మానుకోటలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలుమున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనా రెడ్డి, కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్ లో యంగిస్థాన్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మదర్సాలోని వలస కూలీలకు, హిజ్రాలకు నిత్యావసర సరుకుల కిట్స్ (10 కిలోల బియ్యం, పప్పు ధాన్యాలు, గోధుమ పిండి, ఉప్పు, కారం పొడి, పసుపు, పాల పొడి,ఒంటి సబ్బు, బట్టల సబ్బు, సానిటరీ న్యాప్కిన్, బ్రెడ్ పాకెట్) ను మంత్రి సత్యవతి రాథోడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు రూ.10వేల చెక్కును మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ మహ్మద్ అఫ్సర్ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ శ్రీ రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.