రైతులకు శుభవార్త..14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు!

వరంగల్: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పలు రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2020-21 మార్కెటింగ్ సీజన్‌లో మద్దతు ధరలను 50 శాతం నుంచి 83 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ తెలిపారు.రైతులకు శుభవార్త..14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు!14 రకాల ఖరీఫ్ పంటలకు ఇది వర్తించబోతుందని ఆయన వివరించారు. ఈ క్రమంలో ప్రొద్దు తిరుగుడుకు రూ.5885(100 కేజీలకు), హైబ్రిడ్ జొన్నకు రూ.2,620(100 కేజీలకు), మొక్కజొన్నకు రూ.1,850(100 కేజీలు), కందిపప్పుకు రూ.6000(100 కేజీలకు) మద్దతు ధరగా ఉండబోతున్నట్లు పేర్కొన్నారు. అలాగే రైతులు తీసుకున్న రుణాల గడువు పెంచుతామని, ఆగష్టు లోపు రైతులు తీసుకున్న రుణాలు చెల్లించొచ్చని స్పష్టం చేశారు.