కల్వకుంట్ల కవిత అరెస్ట్

కల్వకుంట్ల కవిత అరెస్ట్

కల్వకుంట్ల కవిత అరెస్ట్వరంగల్ టైమ్స్, హైదరాబాద్: నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులతో కలిసి మంగళవారం సాయంత్రం కవిత ధర్నా నిర్వహించారు.
హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కవిత బైఠాయించారు. ఏ క్రమంలోనే కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. కవితతో పాటు పలువురు జాగృతి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ లను నిరసిస్తూ నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట తెలంగాణ జాగృతి శ్రేణులు ఆందోళనకు దిగాయి. కల్వకుంట్ల కవిత అరెస్ట్ ను నిరసిస్తూ ఠాణా ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే అరెస్ట్ కు ముందు కవిత మీడియాతో మాట్లాడారు. పోలీసులు బలప్రయోగంతో అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు.

మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు కడుతున్న బిల్డింగులను వదిలిపెట్టి పేదవాళ్ల బిల్డింగులు కూలగొడుతుండటం సిగ్గుచేటన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది.. దానినే కాంగ్రెస్ కొనసాగిస్తోంది.. పెద్దల పక్షాన్నే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం అని కవిత విమర్శించారు.మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదు.. అదే వెలుగుమట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా కూల్చేశారు.
హైదరాబాద్ శివారుల్లో పేదల ఇండ్లను కూల్చేసినందుకు ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.కల్వకుంట్ల కవిత అరెస్ట్బుధవారం అయినా హైడ్రా బుల్‌డోజర్లు ఇక్కడికి వస్తేనే, రంగనాథ్ స్పందించి చర్యలు తీసుకుంటేనే ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదని మేం భావిస్తాం అని అన్నారు.ఇతర నిర్మాణాలకు మూసీ ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కొందరు పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్న అనుమతులు ఇస్తున్నారంటే ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో తేలిపోతున్నది.ఈ అక్రమ నిర్మాణాలపై జాగృతి న్యాయపోరాటం చేస్తుందని రేవంత్ సర్కార్ ని కవిత హెచ్చరించింది.