తెలంగాణలో శనివారం 1,850 కరోనా పాజిటివ్ కేసులు
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: తెలంగాణలో శనివారం 1,850 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌కార్పొరేషన్ పరిధిలోనే 1,572 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,312 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ ఐదుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 288కు చేరింది. ఇవాళ 1,342 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 11,537 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా రాష్ట్రంలోని వివిధ దవాఖానల్లో 10,487 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 1,10,545 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 1572, రంగారెడ్డి జిల్లాలో 92, మేడ్చల్ జిల్లాలో 53, వరంగల్ అర్బన్‌లో 31, కరీంనగర్‌లో 18, నిజామాబాద్‌లో 17, నల్లగొండలో 10, సంగారెడ్డిలో 8, ఖమ్మంలో 7, వరంగల్ రూరల్ జిల్లాలో 6, మహబూబ్‌నగర్, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, జనగామలో మూడు చొప్పున, గద్వాలలో 2 కేసులు నమోదయ్యాయి. అలాగే, నిర్మల్, భువనగిరి, మెదక్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు రిజిస్టర్ అయ్యాయి.