నిరాడంబరంగా గురు పౌర్ణమి

నిరాడంబరంగా గురు పౌర్ణమి

వరంగల్ అర్బన్: హన్మకొండలోని ప్రసిద్ధిగాంచిన సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి పర్వదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఆలయ నిర్వహకులు వేడుకలను నిడారంబరముగా నిర్వహించారు. ఉదయం మందిర పూజారులు కిషోర్ శర్మ, మణి శర్మ, సుమన్ లు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు క్యూలైన్లలో దర్శనం చేసుకొని తరించారు. మందిరాన్ని హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటేషన్ నిర్వహించి, భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తూ దర్శనానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలను ఆలయ చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ , ధర్మ కర్తలు వేయి గండ్ల రమేష్, నిమ్మల శ్రీనివాస్ రాకం సదానందం, సురేష్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అన్నదానాన్ని కానీ భక్తులకు తీర్థ ప్రసాదాలను కానీ చేయలేదు.