పెండింగ్ పనులు వేగవంతం చేయాలి: చీఫ్ విప్ దాస్యం

వరంగల్ అర్బన్ జిల్లా : వరంగల్ మహానగర అభివృద్ధికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందుకు తగ్గట్టుగా అధికారులు కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. కాలనీలలోని అపరిష్కృత సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని సంబంధిత అధికారులను దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గంలోని పెండింగ్ పనులను వేగవంతంగా చేయాలని మున్సిపల్పెండింగ్ పనులు వేగవంతం చేయాలి: చీఫ్ విప్ దాస్యంఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, ప్రజారోగ్య అధికారులతో హన్మకొండ కుడా కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సమీక్షించారు. పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులలో పెండింగ్ లో వున్న రోడ్ నిర్మాణ పనులు , నాలా స్థలాల మార్కింగ్ , ఖాళీ ప్రదేశాల గుర్తింపు, కల్వర్టుల నిర్మాణ పనులు, శాని టేషన్ , స్ట్రీట్ వెండర్స్ స్థితిగతులు , శానిటేషన్ నిర్వహణ ఇతరత్రా ప్రజల సమస్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ సమీక్షించారు. పెండింగ్ లో వున్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి , హరితహారంలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి , మున్సిపల్ కమీషనర్ పమేలా సత్పతి , అడిషనల్ కమీషనర్ నాగేశ్వరరావు , ఎం.హెచ్.ఓ. రాజిరెడ్డి , ఇంజనీరింగ్ , టౌన్‌ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.