స్వచ్ఛ సర్వేక్షన్-2021 కు సిద్ధమవ్వండి: సిడిఎంఏ

వరంగల్ అర్బన్: స్వచ్ఛ సర్వేక్షన్ -2021 కు సిద్ధమవ్వాలని కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిస్ట్రేషన్ డా.సత్యనారాయణ అన్నారు. శనివారం హైద్రాబాద్ సి.డి.ఎం.ఏ. కార్యాలయం నుండి వివిధ మున్సిపాలిటీ ల కమీషనర్లు, అధికారులతో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్-2021 కు సిద్ధమవ్వండి: సిడిఎంఏఈ సందర్భంగా వరంగల్ జీడబ్ల్యూఎంసీ ప్రధానకార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కమీషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భం గా సి.డి.ఎం.ఏ. మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్-2021 లో ఉత్తమ గణనాలు సాధించడానికి ఇందుకు సంబంధించిన టూల్ కిట్ లో ఉన్న ప్యారామీటర్ ల గురించి అవగాహన కలిగి ఉండాలని, సర్వీస్ లెవల్ బెంచ్ మార్క్, సర్టిఫికేషన్స్ తో పాటు సిటీజన్ ఫీడ్ బ్యాక్ లపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సారి నిర్వహించే పోటీల్లో డైరెక్ట్ అబ్జర్వేషన్ లేదని, వీటిని 3 క్వార్టర్లు విభజించి మొదటి క్వార్టర్ లో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలు, రెండవ క్వార్టర్ లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లుగా విభజించడంతో పాటు మూడవ క్వార్టర్ లో ఇందుకు సంబంధించిన డేటా నమోదు ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశాంచారు. ప్లాస్టిక్ నిషేధం, సి.ఎన్.డి.వేస్ట్, డంప్ యార్డ్ ల నిర్వహణతో పాటు పారిశుధ్య సిబ్బందికి పి.పి.ఈ. కిట్ ల అందజేతతో పాటు వారు కెపాసిటీ బిల్డింగ్ ప్రక్రియలో భాగం గా పని సామర్థ్యము పెంచుకునేల చూడాలని తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకం గా తీసుకుందని ఇట్టి కార్యక్రమం పై ప్రత్యేక శ్రద్ధ వహించి 1 ఎకరంలో కనీసం వెయ్యి మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. మియావాకి ప్లాంటేషన్ పై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం, ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బందికి ప్రతి శుక్రవారం అవార్డ్స్ ఇవ్వాలని సి.డి.ఎం.ఏ. అన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా ఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి, సి.హెచ్.ఓ.సునీత, డిప్యూటీ కమీషనర్ గోధుమల రాజు, సెక్రటరీ విజయ లక్ష్మి, ఈ.ఈ.లు లక్ష్మారెడ్డి, విద్యాసాగర్,డి.ఈ. నరేంధర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.