ఊహాగానాలకు చెక్…శశికళ కొత్త పార్టీ

ఊహాగానాలకు చెక్…శశికళ కొత్త పార్టీ

ఊహాగానాలకు చెక్...శశికళ కొత్త పార్టీఅసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ కొత్త పార్టీని ప్రకటించారు. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో పాటు దివంగత నేతలు జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ ఫొటోలతో డిజైన్ చేసిన జెండాను ఆవిష్కరించారు. పార్టీ పేరును త్వరలోనే వెల్లడిస్తానని, రాజకీయాల్లో తన మార్క్ ఏంటో చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక అన్నాడీఎంకే పార్టీ పక్కనపెట్టడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీతో బరిలోకి దిగుతున్నారు. తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానంటోంది శశికళ. అయితే మంగళవారం దివంగత సీఎం జయలలిత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శశికళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వింటారని బహిరంగంగా ప్రకటించారు. దీంతో రేపోమాపో శశికళ తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తూ, కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు సర్వత్రా వినిపించాయి. ఇంతలోనే పార్టీ పెడుతున్నట్లు ఆమె ప్రకటించారు