హోలీ పండుగ రోజు తీవ్ర విషాదం

హోలీ పండుగ రోజు తీవ్ర విషాదం

వరంగల్ టైమ్స్, యాదాద్రి జిల్లా: యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐశ్వర్య అనే మహిళ తన 2 ఏళ్ల పాప, 10 నెలల బాబును హతమార్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. భర్తతో విభేదాల కారణంగా కొంతకాలంగా పుట్టింట్లో ఉంటున్న ఐశ్వర్య, భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవల కారణంగానే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.