ఎఫ్టీఈఏకు దరఖాస్తుల ఆహ్వానం
మార్చి 6 వరకు దరఖాస్తులకు గడువు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్స్ లెన్స్ అండ్ అచీవ్ మెంట్ (ఎఫ్ టీఈఏ) ప్రోగ్రాంకు ఉపాధ్యాయులు మార్చి 6లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు గురువారం సూచించారు. ఎంపికైన టీచర్లు 6 వారాల పాటు అమెరికాలోని యూఎస్ యూనివర్సిటీ పరిధిలోని స్కూళ్లలో బోధనాభ్యాసన ప్రక్రియలు పర్యవేక్షిస్తారు. 6 నుంచి 12వ తరగతి వరకు ఫుల్ టైం ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు, ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఫారన్ లాంగ్వేజ్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, సైన్స్ , స్పెషల్ ఎడ్యుకేషన్ లో కనీసం 5 యేళ్ల పాటు అనుభవం ఉన్నవారు దరఖాస్తులకు అర్హులని వెల్లడించారు. ఏప్రిల్ మొదటి వారంలో స్క్రీనింగ్ చేస్తారు. అదే నెల చివరి వారంలో టోఫెల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెప్టెంబర్ లో తుది జాబితా ప్రకటిస్తారు. మొదటి విడతలో ఎంపికైన వారిని 2027 జనవరి నుంచి మార్చి వరకు, రెండో విడత టీచర్లను 2027 సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అమెరికాలోని యూనివర్సిటీకి పంపిస్తారు.














