మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదు

మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదు

మాజీ అధ్యక్షుడికి జీవిత ఖైదువరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కొరియా రాజకీయ చరిత్రలో ఓ కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికారంలో ఉన్నప్పుడు అప్రజాస్వామికంగా ‘మార్షల్ లా ‘ (సైనిక పాలన) విధించిన కేసులో మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోలు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దక్షిణ కొరియా చరిత్రలో జీవిత ఖైదు పడిన మొదటి మాజీ అధ్యక్షుడిగా ఆయన నిలిచారు.