టీంఇండియా వైస్ కెప్టెన్ గా గుంటూరు జిల్లా వాసి

టీంఇండియా వైస్ కెప్టెన్ గా గుంటూరు జిల్లా వాసిఅమరావతి : అంతర్జాతీయ క్రికెట్లో గుంటూరు జిల్లా వాసి చోటు దక్కించుకుని సంచలనం సృష్టించాడు. వచ్చే నెల నుండి జరిగే అండర్ -19 వరల్డ్ కప్ జట్టులో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్ రషీద్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో సెకండ్ ఇంటర్ చదువుతున్నాడు. మంగళగిరిలో ప్రత్యేక కోచ్ ల ద్వారా శిక్షణ పొందుతున్నాడు. కుర్రాడి ఎంపిక పట్ల తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.